జమ్ము కశ్మీర్: జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో 2019 ఫిబ్రవరి 14 న భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.
అయితే ఈ దారుణ ఘటనలో ఇన్షా జాన్(23) అనే ఓ యువతి హస్తం ఉన్నట్టు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు బృందం) తెలిపింది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రధాన కుట్రదారు అయిన మహ్మద్ ఉమర్ ఫరూక్తో పాటూ మరి కొంతమంది ఉగ్రవాదులతో ఇన్షా జాన్ కి సంబంధాలు ఉన్నట్టు గుర్తించనట్టు ఎన్ఐఏ తన ఛార్జిషీట్లో పేర్కొంది. ఆ యువతి తండ్రి కూడా తనకు సహకరించినట్టుగా గుర్తించారు.