ముంబై: టీమిండియా మాజీ క్రికెట్ సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, సౌరభ్ గంగూలీ బీజేపీ లో చేరతారా లేదా అనే చర్చ మొదలైంది. వీరిద్దరని అక్కున చేర్చుకుని రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ చూస్తుందా అని అటే అవుననే విధంగా సంకేతాలు కన్పిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని ఇంటికి పంపించేందుకు సౌరభ్ గంగూలీని ప్రయోగించేందుకు కమలం పార్టీ సన్నద్ధమవుతుందని అంటున్నారు.
మొన్న జరిగిన సార్వాత్రిక ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని సీట్ల సంఖ్యను పెంచుకున్నది. అయితే ఆ పార్టీని నడిపించే రథ సారథి లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవడం లేదా అధికారం దక్కించుకునేంకు గంగూలీని వినియోగించుకోవాలనే దిశగా పార్టీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నారు.
ఇక ధోనీ కూడా కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారంటున్నారు. ఇక ఆయనకు రాజకీయాలు చేయడమే మిగిలి ఉందని, త్వరలోనే కాషాయతీర్థం పుచ్చుకోవడం ఖాయమని సన్నిహితులు చెబుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో అనేక విజయావకాశాలు ఉన్నాయని, పార్టీకి బలం అవుతారని అంటున్నారు.