పొలిటికల్ ఐ సెప్టెంబర్25:
బిగ్ బాస్ 4 సీజన్ షో స్టార్ట్ అయిన కొత్తలో రేటింగ్ అన్ని షోలని మించి పోయి రికార్డ్ సృష్టించింది. కానీ తర్వాతర్వాత కనీసం సీరియల్స్ కి వచ్చిన రేటింగ్ కూడా రాలేదు. దింతో బిగ్ బాస్ షో రేటింగ్ కోసం కొత్త ఆలోచనతో షో ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు.మొదట వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో సాయి ని షో లోకి తీసుకొచ్చారు. అనంతరం ఒక వారం రెండు ఎలిమినేషన్స్ ఉంటాయని ప్రేక్షకుల్లో ఆసక్తి రేపి లేదు కేవలం హెచ్చరిక మాత్రమేనని షాక్ ఇచ్చారు.ఇక మరో వారం ఇంకో కాంటెస్టెంట్ ని వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ చేయించారు అతనే జబర్దస్త్ అవినాష్…ఇక కొత్త గేమ్స్ తో షో కొనసాగుతున్న తరుణంలో ఐపీఎల్ వచ్చేసింది.. దింతో బిస్ షో రేటింగ్స్ ఒక్కసారిగా పడిపోసాగాయి.. ఇక ఐపీఎల్ ఒక రకంగా ప్రభావం చూపితే ఇటు కాంట్రస్టెంట్స్ కూడా అంతగా ఆకర్షించట్లేదనే వార్తలు వినిపించాయి..
సరిగ్గా ఇలాంటి టైములో బిగ్ బాస్ హౌస్ లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని తెలిసేలా ప్రోమో వదిలాదు. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఇవ్వనుంది. జంప్ జిలానీ, బ్రేకప్, చిత్రాంగద సినిమాల్లోని పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న స్వాతి దీక్ష్తిత్ ఏ మేరకు ప్రేక్షకులను అకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.