పొలిటికల్ ఐ: బిగ్ బిస్ 4 షో బుల్లి తెర పై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ షో కి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ 4 5 వారాలు పూర్తి చేసుకుంది. ఐతే ప్రస్తుతం గా ఉన్న నాగార్జున ఒక 20 రోజులు షో కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.షూటింగ్ నిమిత్తం విదేశాలు వెళ్లి రానున్నట్లు సమాచారం. దింతో నాగార్జున స్థానంలో ఒక కొత్త గెస్ట్ రానున్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రేక్షకులు ఎక్కువ గా జూనియర్ ఎన్టీఆర్ ,వెండితెర మహిష్మతి రమ్యకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి..
ఐతే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా రోజుల తర్వాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం 2 వారాల సమయం దర్శకుడు రాజమౌళి కి ఇచ్ఛిన్నట్లు తెలుస్తోంది.దింతో ఎన్టీఆర్ హోస్ట్ చేయడం అనుమానమే..ఇక హీరోయిన్, నటి రమ్యకృష్ణ గత బిగ్ బాస్ 3 లోను నాగార్జున హాలిడేస్ లో ఉన్నపుడు హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకుల మెప్పు పొందింది. దింతో నాగార్జున లేని సమయంలో రమ్యకృష్ణ బిగ్ బాస్ 4 షో కి హోస్ట్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక విరిద్దరితో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు వేరే సెలబ్రిటీ లను కూడా అన్వేషిస్తున్నారటా..! చూద్దాం నాగార్జున ఇస్తున్న గ్యాప్ ని ఎవరు ఫిల్ అప్ చేస్తారో.