హైదరాబాద్: రాష్ట్రంలోనే కాక.. యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన కీసర తహశీల్దార్ లంచం కేసు ఏసీబీ విచారణలో ఊహించని ట్విస్టులు ఎదురౌతున్నాయి. కీసర తహశీల్దారు నాగరారు లంచంగా తీసుకున్న రూ.1.10 కోట్లు ఒకే వ్యక్తి అంత పెద్దమొత్తంలో ఎలా సమకూర్చుకో గలిగాడన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది.
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న ఆ భూమి అలసు యజమానులెవరు? లంచం ఇచ్చినవారే యజమానులైతే.. సొంతభూమికి లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముంది?. ఆ డబ్బు ఎక్కడిదన్న విషయంలో ఫిర్యాదు దారుల నుంచి కూడా సమాధానం రాకపోవడంతో.. ఆ కోటి రూపాయలలో పెద్దల హస్తం ఉన్నట్టుగా.. ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.