Politicla Eye

అక్క కోసం హనుమంతుడి పాత్ర పోషించేది ఎవరు..?

పొలిటికల్ ఐ సెప్టెంబర్ 18: టీఆరెస్ పార్టీ లో కొత్తగా ఒక అంశం పై గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ గుసగుసలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి . మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కు టీఆరెస్ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా..ఈ ఎన్నికలో కవితక్క విజయం నల్లేరు మీద నడకే.. ఐతే గెలిచిన తర్వాత కవితక్క కు క్యాబినెట్ లో చోటు దక్కుతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఐతే క్యాబినెట్ లో ప్రస్తుతం ఖాళీ లేదు. మొత్తం 18 మంది కాబినెట్ ఉన్నారు.మరి క్యాబినెట్ లో కవితక్క కు చోటు దక్కాలంటే ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్నవారి లో ఎవరైనా ఒకరు హనుమంతుడు రాముడు నా గుండెలో నే ఉన్నాడని తన విధేయత చూపించిన్నట్లు కేసీఆర్ కుటుంబానికి నేను హనుమంతుడిని అని విధేయత చట్టుకునేది ఎవరు…? అనే చర్చ అటు టీఆరెస్ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో ఎంపీ గా కవిత ఓటమి చెందిన తర్వాత సొంత జిల్లాలో ఎమ్మెల్యే లు తమ పదవి వదులుకొని కవితక్క కు ఇవ్వడానికి సిద్ధమైయ్యారు, పోటీ పడ్డారు. ఐతే ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది.. క్యాబినెట్ పదవి వదులుకోడానికి కొంత మంది నేతలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఐతే అందులో సొంత జిల్లలో ఉన్నవారు లేదా పక్క జిల్లాల వారు ఉన్నారా అనేది క్లారిటీ గా లేదు కానీ కేసీఆర్ కుటుంబానికి విధేయత చాటుకోడానికి క్యాబినెట్ లో ఉన్న చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఎవరు ముందుకు రానున్నారు అనేది ఆసక్తిగా మారింది..

Get real time updates directly on you device, subscribe now.

You might also like