Politicla Eye

కంగనా వెనక ఉన్నది ఎవరు??

పొలిటికల్ ఐ సెప్టెంబర్ 22: కంగనా… ఈ పేరు చెపితే తెలియని వారంటూ ఎవరు ఉండరు.బాలీవుడ్ టాప్ హీరోయిన్ జన్సీ లక్ష్మీభాయ్ ఇప్పుడు ఏదొక ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. సుశాంత్ మరణం తర్వాత కాంట్రావెర్సీ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది.. సుశాంత్ మరణానికి బడా బాలీవుడ్ స్టార్లు ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లాంటి వాళ్ళు కారణం అంటూ కుండ బద్దలు కొట్టింది. బాలీవుడ్ ని మాఫియా నడిపిస్తుందంటూ కూడా చెప్పింది. దీనిపై తాప్సి లాంటి తారలు కొంత మంది ఘాటుగానే సమాధానం ఇచ్చారు కూడా. దాని తర్వాత సినీ తార ఊర్మిలని పోర్న్ స్టార్ అంటూ వ్యాఖ్యలు చేసింది. జయ బచ్చన్ పి కూడా కంగనా విరుచుకుపడింది. పార్లమెంట్ లో ఎవరో ఒకరు చేసే దానికి సినీ ఇండస్ట్రీని తప్పు పట్టడం సారి కాదని చెప్పిన జయాకి సమాధానం గా “జయాబచ్చన్‌ గారు. నా స్థానంలో మీ కుమార్తె శ్వేతను టీనేజీలోని అవమానించి, కొట్టి, డ్రగ్స్‌కు బానిసను చేసుంటే ఇలాగే వ్యాఖ్యానిస్తారా? మీ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ తనను బెదిరిస్తున్నారని చెప్పి ఓ రోజు ఉరి వేసుకుని వేలాడుతుంటే కూడా ఇలాగే మాట్లాడుతారా.. మాపై కూడా మీరు కరుణ చూపించండి” అని అన్నారు కంగనా.

ఇది మాత్రమే కాకుండా ముంబై ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటూ ముంబై ని కించపరిచింది. మహారాష్ట్ర సీఎం ని బాబర్ తో పోల్చింది. తాజాగా పార్లమెంట్ లో రైతుల బిల్లు పాసవ్వటంతో రైతులు చేసిన ఆందోళనని ఈ ఆందోళన టెర్రరిస్టులు చేస్తున్నారు రైతులు చేస్తున్నది కాదు అంటూ మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ఏదొక విషయంలో ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

కానీ కంగనా చేస్తున్నదంత కేవలం సామాజిక స్పృహ, బాద్యతతోనే ఇదంతా చేస్తుందా.. సినీ అవకాశాలు తగ్గిపోయాక రాజకీయాల్లో చేరటం కోసం రాజకీయ ఎత్తులు వేస్తోందా.. మహారాష్ట్ర మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన శివసేన ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తుంది శివసేన ని గద్దె నుండి దించటం కోసం ఒక జాతీయ పార్టీ వెనుక ఉండి ఆడిస్తున్న ఆటలో కంగనా ఒక ఆట బొమ్మానా? లేదా అనేది ఆసక్తిగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like