విజయవాడ: ఏపీ ప్రభుత్వం నగరంలోని ప్రైవేటు కోవిడ్ సెంటర్ల పై చర్యలు తీసుకున్నది. విజయవాడలో ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతి రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో సెంటర్ల పై వేటు వేసింది.
రమేష్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం సంభవించి పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం రమేష్ హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవడంతో, రమేష్ హాస్పిటల్ యజమాని పారిపోయి హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
నగరంలో ఉన్న ప్రైవేటు కోవిడ్ సెంటర్లపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డా లక్ష్మీ నర్సింగ్ హోమ్ ఎనికేపాడులో హోటల్ అక్షయ లో, ఇండో బ్రిటిష్ హాస్పిటల్ బెంజ్ సర్కిల్ లో హోటల్ ఐరా, ఎన్ఆర్ఐ హీలింగ్ హాండ్స్ అండ్ ఆంధ్రా హాస్పటల్స్ సన్ సిటీ, కృష్ణ మార్గ్ లో సెంటర్లు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పాటు నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు.