Politicla Eye

నా కూతురు జయరెడ్డి చెప్పింది నిజమే…ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తో ఇంటర్వ్యూ

 

ప్రశ్న ) జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కి విధేయుడా…..?

 

సమాధానం :నేను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కీమార్ రెడ్డి కి విధేయుడినే ,పార్టీ పరంగా ఆ పోస్ట్ కి విధేయుడినే ఐతే నా సోషల్ మైండ్ కి ఉత్తమ్ కుమార్ రెడ్డి సరైన వ్యక్తి అందుకే ఆ పోస్ట్ మీద ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఇష్టం..

ప్రశ్న ) కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాత్రమేనా ఎవరు పీసీసీ గా వచ్చిన విధేయుడిగానే ఉంటారా…?

 

సమాధానం : పీసీసీ పోస్ట్ కి ఎప్పుడు విధేయుడినే..ఆ పోస్ట్ మీద భవిష్యత్తులో ఎవరు కూర్చున్న ఆ వ్యక్తి క్యారెక్టర్ బట్టే విధేయుడిని అవుతా…!

 

ప్రశ్న ) జగ్గారెడ్డి కి పీసీసీ పదవి వచ్చిన ఇలాగే ఉంటారా ఎవరికి అందుబాటులో లేకుండా…ఏమైనా మారే అవకాశం ఉందా..!

 

సమాధానం :1 ) నాకంటూ పీసీసీ పదవి వస్తే మూడు రోజులు గాంధీభవన్ లో కూర్చుంటా.
2 ) రెండు రోజులు రాష్ట్రమంతా పర్యటిస్తా
3 ) ఒక రోజు నియోజకవర్గానికి
4 ) ఒక రోజు కుటుంబానికి కేటాయిస్తా

 

ప్రశ్న ) పార్టీ కి విధేయుడిగా ఉండడం అంటే అధిష్టానం ఎవరికి పీసీసీ ఇచ్చిన పని చేయాలి కదా..! చేస్తారా …!

 

సమాధానం ; లాబీయింగ్ ల తో పైరవిలతో పీసీసీ పదవి వస్తే అది సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ విధేయత నుండి వచ్చిన్నట్లు కాదు , ఎలాంటి పైరవీలు లేకుండా సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ ఎవరిని నియమించిన ఆ కుర్చీ కి విధేయుడిగా పని చేస్తా…

 

ప్రశ్న ) జగ్గారెడ్డి వరసురలిగా జయరెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేయనుందా..!ఇది నిజమేనా…! లేదా భవిష్యత్తులో కొడుకునే రాజకీయాల్లోకి తీసుకొస్తారా..!

 

సమాధానం : కూతురు జయరెడ్డి కోసం మెదక్ పార్లిమెంట్ టికెట్ ప్రయత్నం చేస్తున్న..

# కొడుకు రాజకీయాల్లోకి వస్తాడో లేదో ఇప్పుడే చెప్పలేను…

 

ప్రశ్న )  మీ కూతురు మా నాన్న కుటుంబ గురించి అసలు పట్టించుకోరు అని ఒక సందర్భంగా వ్యాఖ్యానించింది ఇది నిజమేనా…?

 

సమాధానం :అవును నిజమే…! ఇంటి సమస్యల కంటే ప్రజల సమస్యల పై దృష్టి పెట్టడం మొదటినుండి నాకు అలవాటు..

 

ప్రశ్న ) జగ్గారెడ్డి టీఆరెస్ లో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే విమర్శ ఉంది ఎందుకు కేటీఆర్ ఇతరుల పై చెయ్యరు..

 

సమాధానం : మా జిల్లా మంత్రి హరీష్ రావే కనుక ప్రజల సమస్యల పై ఆయనే ప్రశ్నిస్తా..తర్వాత కేసీఆర్ సీఎం కనుక ఆయాని ప్రశ్నిస్తా..మిగితా మంత్రులకు జిల్లా తో సంబంధం లేదు కనుక మాట్లాడను అంతే…

 

ప్రశ్న ) పదే పదే జగ్గారెడ్డి టీఆరెస్ కోవర్ట్ అని ,టీఆరెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది ఎందుకు….!

 

సమాధానం : గతంలో రెండుసార్లు పార్టీ మరాల్సి వచ్చింది కనుకే నా పై ఇలాంటి ప్రచారం జరుగుతుంది.

 

ప్రశ్న ) జగ్గారెడ్డి కి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటే అధిష్టానం అడిగితే ఏ శాఖ ఆశిస్తారు..

సమాధానం ;నాకు మంత్రి పదవి పై ఆశ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే చాలు .

ప్రశ్న ) రానున్న రోజుల్లో ప్రభుత్వం పై మీ పోరాటం ఎలా ఉంటుంది ,ఉండబోతుంది చెప్పగలరా…!

సమాధానం : టీఆరెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయనందున్న ప్రజల పక్షాన ప్రభుత్వం పై పోరాడుతూనే ఉంటా..

Get real time updates directly on you device, subscribe now.

You might also like