హైదరాబాద్: హీరో చిరంజీవి, దర్శకులు కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఆచార్య చిత్రం కథన తనదేనని మరో రచయిత ఆరోపించారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రిలీజు చేసిన మోషన్ పోస్టర్ చూసి రచయిత అవాక్కయ్యారు.
ఈ సినిమా కథ నేను రాసుకున్నదే అని రచయిత కన్నెగంటి అనిల్ కృష్ణ స్పష్టం చేశారు. ఆచార్య టైటిల్ తరువాత వచ్చే సన్నివేశం తన కథలోని సన్నివేశం లాగానే ఉందని అన్నాడు. 2006 లో రైటర్స్ అసోసియేషన్ లో ఈ కథకు సంబంధించి పుణ్యభూమి అనే టైటిల్ తో రిజిస్టర్ చేశానని ఆయన తెలిపారు.
కాగా ఇంతకుముందు మరో రచయిత మండూరి రాజేశ్ ఆచార్య కథ తనదేనంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. తన కథను కాపీ చేసుకున్నారంటూ ఆరోపణలు చేశారు. షూటింగ్ పూర్తి కాక ముందే సినిమా కథపై ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.