అమరావతి: కార్యనిర్వాహక రాజధాని దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం ఆపడం లేదు. హైకోర్టులో విచారణ జరిగిన గంటలోనే విశాఖపట్నం కాపులుప్పాడ కొండపై జీఓను జారీ చేసింది.
విశాఖలోని కాపులుప్పాడ కొండపై 30 ఎకరాలను గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్కుక భూమి బదలాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో గ్రేహౌండ్స్ కు కేటాయించిన 300 ఎకరాల్లో 30 ఎకరాలను ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి కేటాయించారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించాలని ఆదేశించిన ప్రభుత్వం ఆదేశించింది.