Politicla Eye

న్యూట్రిషన్ గార్డెన్ ల వలన కలిగే లాభాల & ప్రయోజనాలు

*న్యూట్రిషన్ గార్డెన్ ల వలన కలిగే లాభాల & ప్రయోజనాలు*

* విద్య సంస్థలో న్యూట్రిషన్ గార్డెన్స్..

* ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు ఫౌష్టికాహారం..

* పర్యావరణ హితం – ఆరోగ్యకరమైన వాతావరణం

ఆరోగ్యకరమైన జీవన శైలి & ప్రకృతిపై శిక్షణ కై విద్యా సంస్థలలో న్యూట్రిషన్ గార్డెన్ లు విద్యా సంస్థలలో న్యూట్రిషన్ గార్డెన్ ను పెంచడం ఇటీవల ప్రాచుర్యం పొందడమే కాకుండా ప్రభుత్వాల నుండి కూడా వీటిని ఏర్పాటు చేయాలని ప్రోత్సాహం లభిస్తోంది. ఇలా తోట పెంపకం ద్వారా మధ్యాహ్న భోజనం మరియు హాస్టల్ లో ఉన్న వంటశాలలకు తాజా కూరగాయలు, ఆకుకూరలు తక్కువ ఖర్చుతో లభించడమే కాకుండా మొక్కల పెంపకం పై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతోంది. తద్వారా వారికి భవిష్యత్తులో అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలా తోటలను పెంచడం వలన ఉన్న పలు లాభాల కారణంగా ఎన్నో విద్యాసంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు వీటిపై ఆసక్తి చూపించడమే కాదు కార్యాచరణలో విజయవంతమవుతున్నారు.

భారత ప్రభుత్వం సెప్టెంబర్ మాసమంతా నిర్వహించ తలపెట్టిన పౌష్టికాహార అవగాహనా మాసంలో వీటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే కాకుండా వాటిపై అవగాహన కలిపించాలని నిర్ణయించింది.

విద్యాసంస్థలలో న్యూట్రిషన్ గార్డెన్ యొక్క ఉద్దేశ్యం

విద్యాసంస్థలలో న్యూట్రిషన్ గార్డెన్ లు  అక్కడ పథకం ప్రకారం పెంచబడి ఉత్పత్తి చేయబడిన కూయగారలు, పండ్లు, ఆకు కూరల వలన దాంట్లో చదువుకుంటున్న విద్యార్థులలో ఉన్న పోషక లేమి తో పాటూ సూక్ష్మ పోషకాల లోపాలను కూడా సరిచేయగలగదు.  అంతే గాకుండా విద్యార్థులకు పౌష్టికాహారం మరియు పోషకాల పై విస్తృత అవగాహన కలిపించడమే కాక జంక్ ఫుడ్ తో కలిగే నష్టాలను కూడా నేర్చుకొంటారు.  ఇక చివరకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయం, తోటలను పెంచడం పై విద్యార్థులకు అనుభవం, అవగాహన ఏర్పడడమే కాకుండా తద్వారా పర్యావరణానికి సంబంధించిన ఎన్నో అంశాలను వారు నేర్చుకొంటారు.

న్యూట్రిషన్ గార్డెన్ ల వలన కలిగే లాభాలు & ప్రయోజనాలు

న్యూట్రిషన్ గార్డెన్ ల పెంపకం చేయడం వలన ఎన్నో లాభాలుంటాయి.  అందులో ప్రధానమైనవి….

నేర్చుకోవడానికి మంచి అవకాశం – విద్యా సంస్థలలో ఈ తోటల పెంపకం వలన తోట పని, వ్యవసాయం వంటి పనులపై అవగాహన రావడంతో పాటూ వివిధ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల పోషక విలువలపై కూడా అవగాహన ఏర్పడుతుంది.  అలానే స్వయం సమృద్ది అన్న దానిని అర్థం చేసుకొనే అవకాశం కలుగుతుంది.  ఇక తోట పని, వ్యవసాయం ఎలా చేస్తారనే విషయంలో స్వీయానుభవం గడించడమే కాకుండా పర్యావరణ హితంగా వీటిని ఎలా నిర్వహించవచ్చని నేర్చుకొంటారు.  ఇక పర్యావరణం దానిని కాపాడుకోవడం వలన కలిగే లాభాలు కూడా తెలుస్తాయి.

ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు ఫౌష్టికాహారం

తోటపని, వ్యవసాయ కార్యకలాపాలలో పాల్గొనడం వలన విద్యార్థులకు శారీరక శ్రమ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.  ద్వారా వారిలో శారీరక కార్యకలాపాలు పెరిగి తెలియకుండానే వ్యాయామం చేస్తారు.  తద్వారా వారి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.  ఇక పూర్తిగా సేంద్రీయ వ్యవసాయ పద్దతులు ఉపయోగించి ఈ పనులు చేయడం వలన వారికి పర్యావరణ హితమైన పనులపై అవగాహన రావడమే కాకుండా ఇలా పండించే పంటలు ఎంత ఆరోగ్యవంతమైనవో, వాటి వలన ఎంత పౌష్టికమైన ఆహారం దొరుకుతుందో స్పష్టమవుతుంది.  తద్వారా వారు సమగ్రమైన పౌష్టికాలతో కూడిన భోజనం చేయడానికి వీలవుతుంది.  ఇక చివరగా తామకు నచ్చిన కూరగాయలను పండించుకోవడం ద్వారా వాటితో తయారు చేయబడిన ఆహారాన్ని వారు మరింత ఇష్టపడి తీసుకోవడమే కాకుడా భోజనాన్ని ఆస్వాదిస్తారు.  ఇలా మంచి ఆహారాన్ని ఇష్టపడి స్వీకరించడం వలన వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడుతాయి.

పర్యావరణ హితం – ఆరోగ్యకరమైన వాతావరణం

విద్యార్థులకు పర్యావరణంపై గౌరవం ఇంటి నుండి మొదలై విద్యా సంస్థలలో మరింత బలపడుతుంది.  దీనికనుగుణంగానే న్యూట్రిషన్ గార్డెన్ల కారణంగా విద్యార్థులు పలు రకములైన మొక్కలను, చెట్లను పెంచుతారు.  ఇలా పెంచబడిన వివిధ రకములైన మొక్కలు లేదా చెట్లు ఎన్నో పక్షులను, క్రిమి కీటకాలను, గార్డెన్ స్థాయిని బట్టి జంతువులను ఆకర్షించడమే కాకుండా విద్యార్థులకు ఎండ, వాన, నీటి సరఫరా, మురుగు నీటి శుద్ది వంటి పలు పర్యావరణానికి సంబంధించిన అవకాశాలపై అవగాహన పెంచుకోవచ్చు.  ఎపుడైతే ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా సేంద్రీయ పద్దతులలో నిర్వహించబడుతుందో, దాంతో పర్యావరణానికి సంబంధించిన మరిన్ని రంగులను చూస్తారు.  ముఖ్యంగా మన చుట్టూ ఉన్న పర్యావరణం ఎలా పని చేస్తుంది, ఎలా వ్యవహరిస్తుంది, దానిని మంచిగా ఎలా ఉంచుకోవాలన్న ఎన్నో అంశాలపై విద్యార్థులకు అవగాహన వస్తుంది.

మరెన్నో పర్యావరణహిత అంశాలు

ఇలా పర్యావరణ హితమైన వ్యవసాయం లేదా తోటపని చేసే సందర్భాలలో విద్యార్థులకు ఇంకా ఎన్నో విషయాలపై అవగాహన కలిగించవచ్చు.  నీటిని తోడడానికి సూర్యరశ్మితో పని చేసే పంపులు వినియోగించంతో సోలార్ విద్యుత్తు, దాని ప్రయోజనాలు తెలుసుకోవచ్చు.  అలానే తమ వంటశాల, మరుగుదొడ్డుల నుండి వచ్చే వ్యర్థాల నుండి బయోగాస్ తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రక్రియ మొత్తం అంటే పర్యావరణంలో పదార్థాలు ఎలా వ్యర్థాలుగా మారుతాయి…మారిన ఈ వ్యర్థాలను వదలి వేయకుండా ఎలా వినియోగించుకోవచ్చు అన్న అంశాలు వారికి తెలుస్తాయి. ఇక వర్మికంపోస్టింగ్ టెక్నిక్ ద్వారా సేంద్రీయ ఎరువలను తయారు చేయడం వలన వ్యర్థాలు ఎంత ఉపయోగకరమైనవో మరింత స్పష్టంగా తెలుస్తుంది.

దీంతో విద్యార్థులకు పర్యావరణం పై మరింత అవగాహన కలిగి, పర్యావరణంలో ఉన్న సహజ వనరులను ఎలా వినియోగించుకోవాలనే అంశాలను నేర్చుకోవడమే కాకుండా వారికి మొక్కలు, జంతువుల జీవిత చక్రాలను కూడా అర్థం చేసుకోవచ్చు.

న్యూట్రిషన్ గార్డెన్ లో ఎలాంటి మొక్కలు పెంచవచ్చు

న్యూట్రిషన్ గార్డెన్ లలో పలు రకములైన కూరగాయలు, ఆకు కూరలు, దుంపలు, చిక్కుళ్లు & పప్పు ధాన్యాలు, పండ్ల చెట్లతో పాటూ పలు ఔషద మొక్కలను కూడా పెంచవచ్చు.  అవేమంటే…

దుంపలు – బంగాళా దుంపలు, క్యారెట్, బీట్ రూట్ వంటి పలు దుంప రకాలు కార్భోహైడ్రేట్లు అందించేవే కాక వీటిలో శక్తి మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.  అయితే వీటిలో పలు రకములైన ధాన్యాలక కన్నా తక్కువ ప్రోటీన్లుంటాయి.  వీటిని ఆయా కాలాలకు అనుగుణంగా పెంచుకోవచ్చు.   ఇవి మిగిలిన వండేటపుడు మిగిలిన కూరగాయలతో సులభంగా కలిపి వండవచ్చు.

చిక్కుళ్లు & పప్పు ధాన్యాలు – బఠానీలు, బీన్స్, సోయాబీన్స్, చిక్ పీస్ వంటి ఆహార పదార్థములు ప్రోటీన్ లు ఎక్కువగా కలిగి దాంతో పాటూ కొవ్వు, విటమిన్ ఇ, కాల్షియం, ఇనుము మరియు జింక్ కూడా అందిస్తాయి.  ఇవన్నీ విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగదలకు దోహదపడడమే కాకుండా వారి మెదడు చురుకుగా ఉంచడానికి పనికివస్తాయి.

ఔషద మొక్కలు – పలు రకములైన ఔషదమొక్కలు, మూళికలగా భావించబడే అల్లం, తులసి, కరివేపాకు, మెంతి కూర, అలో వీర వంటి వాటి వలన విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో దోహదం చేస్తాయి.  అంతే గాకుండా వీరిలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధులను అరికట్టడమే కాకుండా వారిలో ఏర్పడే జీర్ణ సంబంధిత సమస్యలను కూడా దురం చేస్తాయి.  వీటితో పాటూ మానవ శరీరానికి అవసరమైన పలు విటమిన్స్, మినరల్స్ కూడా అందిస్తాయి.  వీటితో పాటూ బొప్పాయి, మునక్కాయ లాంటి చెట్లను పెంచితే వాటి కాయలు, పండ్లతో పాటూ ఆకులు కూడా పలు రకములైన వంటకాలలో వినియోగించడమే కాకుండా వాటి వలన ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

ఇవే కాదు మరెన్నో మొక్కలు, చెట్టు పెంచడానికి అవకాశమున్న ఈ న్యూట్రిషన్ గార్డెన్ లు ఇంటిలో ఏర్పాటు చేసే వంట తోటల వలే ఎంత ప్రయోజనాకారో మనకు అర్థం అవుతుంది.  నేర్చుకోవడం, విజ్ఞానాన్ని పెంచుకోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారం వంటి ఎన్నో లాభాల ను విద్యార్థులకు ఇవి అందిస్తాయనడంలో సందేహం లేదు.  అందుకే ఇపుడైనా వీటిపై అవగాహన పెంచుకొని వీటిని ప్రోత్సహిద్దామా.

Article is prepared by
Dr A Kiraannmayee,  Chief Clinical Dietitian, Apollo Cradle, Jubilee Hills, Hyderabad

Get real time updates directly on you device, subscribe now.

You might also like