అసెంబ్లీ ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి..
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 10: రవీంద్ర భారతి సమీపంలోని కమాత్ హోటల్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం ప్రయత్నం చేసుకున్నాడు. తెలంగాణ వచ్చిన తరువాత నాకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటు పెట్రోల్ పోసుకున్నట్లు స్థానికుల తెలిపారు.జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు సమాచారం. ఆత్మహత్యత్నం చేసుకున్న వ్యక్తి నాగులు తండ్రి పేరు రాములు కడ్తల్ గ్రామ వాసిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.. వెంటనే పసిగట్టి అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేసి హాస్పిటల్ కు తరలించారు. అపరిచిత వ్యక్తి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ప్రయివేట్ టీచర్ గా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు పడ్డరు.ఈ సందర్భంగా ప్రతీక్ష సాక్షిగా మాట్లాడుతూ. కేసీఆర్ సర్ న్యాయం చేయమని బాధితుడు అరిచినట్టు సమాచారం. జై తెలంగాణ అని నినాదం ఇచ్చిన వ్యక్తి. నిప్పంటించుకున్న వెంటనే మంటలు ఆర్పేసిన పోలీసులు. తనకు బతకడానికి పని లేదంటూ అరిచిన్నట్లు స్థానిక వ్యక్తుల తెలియచేశారు.సగం శరీరం కాలినట్టు తెలిపిన ప్రత్యక్ష సాక్షి. వెంటనే ఆటోలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.