ఢిల్లీ: కరోనా పాజిటివ్ సోకి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు చనిపోవడం విన్నాం. తొలిసారిగా కేంద్ర మంత్రి కరోనా పాజిటివ్ తో చావుబతుకుల్లో ఉన్నారు. ఆయనే కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్.
కేంద్ర మంత్రి శ్రీపాద్ ఆరోగ్యం విషమంగా ఉందని, ఆక్సీజన్ స్థాయి అమాంతం పడిపోయాయని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. గోవా రాజధాని పనాజీలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి చికిత్స తీసుకుంటున్నా సాధారణ స్థితికి రావడం లేదు.