ఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ కార్యదర్శి వ్యక్తిగత వెబ్ సైట్ ను కూడా హ్యాకర్లు వదిలిపెట్టడం లేదు. పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లే సైట్ ను హ్యాక్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆగస్టు 15 నుంచి ఆయన వ్యక్తిగత వెబ్ సైట్ లో దేశ వ్యతిరేక సందేశాలు వస్తున్నాయి. దీన్ని గమనించిన నిర్వాహకులు ఏదో జరుగుతుందని నిర్థారణకు వచ్చారు. అయితే అది వ్యక్తగతంగా నిర్వహిస్తున్న వెబ్ సైట్. దీనిలో పార్టీ, వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ఐటీ శాఖ నిపుణులతో హ్యాకింగ్ నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.