వాషింగ్టన్ : త్వరలో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో రాజకీయ వేడి రాజుకుంది. ప్రత్యర్థులు నువ్వానేనా అన్నట్టుగా ఇప్పటినుంచే పోటీపడుతున్నారు.
ఈ తరుణంలో డెమొక్రాట్లు ఇండో అమెరికన్ కమలా హారిస్ ను ఎంపిక చేసిన నేపథ్యంలో.. ట్రంప్ డెమోక్రాట్లకు ఊహించని షాక్ ఇస్తూ.. ఇండో అమెరికన్ యూఎన్ మాజీ అంబాసిడర్ నిక్కీ హేలీని రంగంలోకి దించారు. గతంలో నిక్కీ హేలీ సౌత్ కరోలినా గవర్నర్ గా పనిచేశారు. ట్రంప్ తాజా నిర్ణయంలో ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వేచి చూడాల్సిందే మరి.