సంగారెడ్డి : చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన జిల్లాలోని అమీన్ పూర్ మండలం అయిలాపూర్ తండాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. స్థానిక అయిలాపూర్ తండాకి చెందిన ఇద్దరు మహిళలు బట్టలు ఉతికేందుకు స్థానిక చెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతికే క్రమంలో ప్రమాదవ శాత్తూ ఇద్దరూ చెరువులో పడి మునిగి పోయారు. ఆ సమయంలో వారిని ఎవరూ గమనించక పోవడంతో ఇద్దరూ మృతి చెందారు.