తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇవాళ వర్చువల్ పద్దతిలో భేటీ కానుంది. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పారదర్శకతలను పాటించేందుకు తొలిసారిగా టీటీడీ బోర్డ్ మీటింగ్ ను ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్) లో ప్రసారం చేయనున్నారు.
ఈ సమావేశంలో 52 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. గత ఐదు నెలలుగా టీటీడీ ఆదాయం పూర్తిగా తగ్గిపోవడంతో వేతనాలు చెల్లించేందుకు కార్పస్ ఫండ్ నుంచి డబ్బు విత్ డ్రా చేసే యోచనలో ఉంది. పలు కీలయ నిర్ణయాలు తీసుకోనున్నారు.