పొలిటికల్ ఐ: దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు.. ఎన్నికలకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక పై తీవ్రమైన కసరత్తు చేస్తున్నాయి అన్ని పార్టీ లు.టీఆరెస్ లక్ష ఓట్ల మెజార్టీ తో గెలుస్తామని ధీమాగా ఉంది. అధికార పార్టీ ఫలితాల మీద గట్టి ధీమా…హరీష్ అంతా తానై చూసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గానే కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో కనీసం పరువు నిలబెట్టుకునే ల అయినా ఫలితం ఉండాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అభ్యర్థి ఎంపికపై ఇప్పటి వరకు పరిశీలనలో ఉన్న డీసీసీ అధ్యక్షుడు నర్సిరెడ్డి పేరు ఫైనల్ అనుకుంటున్న సమయంలోనే కాంగ్రెస్ నాయకుల నోటా మరో పేరు వినిపిస్తుంది. మాజీమంత్రి ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాలు కొంత ఫలితం వచ్చేలా కనిపిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి కూడా సొంత అనుచరులతో సమావేశం అయ్యారు. పార్టీ మరాలా.. ? లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలా. అనే ఆలోచన కూడా ఉంది. అయితే… ముత్యం రెడ్డి కుటుంబానికి ..కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి ని అభ్యర్థిగా ప్రకటిస్తే… పార్టీ కి కూడా కొండంత అండ అనే ఆలోచన లో ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఈ కసరత్తు చేస్తున్నారు. పార్టీ నాయకత్వం మాత్రం శ్రీనివాస్ రెడ్డి చేరిక దాదాపు ఖరారైంది అని చెప్తుంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే… మిగిలిన అభ్యర్థుల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టోచ్చని కాంగ్రెస్ చూస్తుంది. ఒకవేళ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకపోతే …సొంత పార్టీ నాయకుల నుండే ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.
Get real time updates directly on you device, subscribe now.
Prev Post
Next Post