Politicla Eye

ఇప్పుడు తొడలు కొట్టే టైమ్ మీది.. నెక్స్ట్ మాదే

ఇప్పుడు తొడలు కొట్టే టైమ్ మీది.. నెక్స్ట్ మాదే..

* ఇప్పుడు మీ దుకాణం నడుస్తోంది నెక్స్ట్ మా దుకణమే

* ప్రస్తుత కార్పొరేటర్లు మా పార్టీ వారే కదా..!

* ఈ రోజు మీ దగ్గర ఉన్నారు రేపు మేము గెలిస్తే ఇక్కడ ఉంటారు..

* టీఆరెస్ ఇచ్చే డబ్బులు తీసుకొని కాంగ్రెస్ కి ఓటు వేయండి.

* టీఆరెస్ ఇచ్చే డబ్బులు కూడా ప్రజాలవే కదా..!

పొలిటికల్ ఐ :మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కి జిహెచ్ఎంసీ ఎన్నికలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శల జల్లు కురిపించారు. అధికారంలో ఎవరు ఉంటే.. ఆ పార్టీ మేయర్ జీహెచ్ఎంసీ లో ఉంటారు ఇది సత్యం గత చరిత్ర చూసుకున్న మీకే తెలుస్తుంది.గొప్పలు మాట్లాడి..ప్రభుత్వాన్ని తలసాని బదనాం చేస్తున్నాడని గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. మీకు అభ్యర్థులు లేక మా పార్టీ నేతలనే మీరు టిక్కెట్ ఇచ్చారనే విషయని తలసాని మర్చిపోవద్దని సూచించారు. ఈరోజు మీ దుకాణం నడుస్తుంది..భవిష్యత్ లో మా ప్రభుత్వం వచ్చాక మా దుకాణం నడుస్తోందని అన్నారు.ఎవరిది ప్రభుత్వం ఉంటె వారి దుకాణమే నడుస్తుందని ,ఎంతటివారైనా ఏదో ఓక రోజు ఓడాల్సిందేనని గ్రేటర్ ఎన్నికల్లో ఏవరికి , ఎలా ప్రజలు షాకిస్తరో తెలియదని హితవు పలికారు. జీహెచ్ఎంసీ లో కాంగ్రెస్ మేయర్ వస్తే ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తామని కాంగ్రెస్ మేయర్ ను గెలిపిస్తే.. ప్రతిపక్షం గా హైదరాబాద్ సమస్యల పై ప్రభుత్వం పై గట్టిగా పోరాడుతుందని అన్నారు. టిఆర్ఎస్ దగ్గర మస్త్ పైసలు ఉన్నాయి.. ఓటుకు అయిదు నుంచి పది వేలు ఇస్తరు.. టిఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకోని కాంగ్రెస్ కు ఓటు వేయండని ప్రజలకు తెలిపారు.కాంగ్రేస్ నుంచి టిఆర్ఎస్ వెళ్లిన ఓక్క ఎమ్మెల్యే అయినా బయట కనపడుతున్నారా..!
మా పార్టీ లో మిగిలిన 6 మంది ఎమ్మెల్యేలం 110మంది కి గట్టి జవాబు ఇస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like