హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం ఏర్పడినట్టు తెలిపింది. దీనికి తోడు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు తెలిపింది.