Politicla Eye

ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్

తిరుమల: సెప్టెంబరు 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా‌నే నిర్వహించాలని నిర్ణయించామని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.

అధిక మాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు రావడం జరిగింది. అక్టోబర్ లో‌ జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితుల‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమలలో‌ పాలక‌మండలి‌ సమావేశం ముగిసిన‌ తరువాత సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో రేపటి నుండి మూడు వేల ఉచిత దర్శన టోకెన్స్ జారీని తిరిగి‌ ప్రారంభిస్తున్నాం. త్వరలోనే ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లను ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీవారి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని, ముంబై లో దేవాలయం నిర్మాణం కు శ్రీకారం చుడతామని సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీలో ఆదాయం పెంచేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని ఆయన వివరించారు. ఫిక్స్ డ్ డిపాజిట్ల పై కార్పస్ ఫండ్స్ లో కొన్ని మార్పులు తీసుకురానున్నామన్నారు. బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలోనే చిన్న‌ పిల్లల ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. వైజాగ్ లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేశామని, కరోనా ప్రభావం తగ్గిన తరువాత మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.

రూ. 4.95 కోట్లతో వైజాగ్ శ్రీవారి ఆలయంకు ఘాట్ రోడ్ల నిర్మాణం కు చేపట్టబోతున్నామన్నారు. టీటీడీ ఉద్యోగులకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో వివిధ సేవా కార్యక్రమాలు బుక్ చేసుకున్న భక్తులు అయోమయంలో ఉన్నారని ఆయన అన్నారు.

ఉదయస్తమాన సేవలు బుక్ చేసుకున్న భక్తులకు వీఐపీ బ్రేక్ సేవ‌ కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. సుధా నారాయణ మూర్తి రూ.1 కోటి విరాళం ఇస్తాంమని ప్రకటించారు. గోవు సంరక్షణపై పాలక మండలిలో చర్చించాం..ప్రతి ఆలయం వద్ద ఓ గోమాత ఉంచాలని నిర్ణయించామని సుబ్బారెడ్డి చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like