లక్నో: జనావాసాల్లోకి ఓ పులి చొరబడి తీవ్ర కలకలం రేపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని పిల్ బీట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గడిచిన రాత్రి ఓ పులి స్థానిక పిల్ బిట్ ప్రాంతంలో ఓ పులి జనావాసాల్లోకి చొరబడింది. అనంతరం అక్కడి నుంచి ఉత్తరాఖండ్ వైపు వెళ్లింది.
పులి వెళ్లిన ఘటన మొత్తం అక్కడి సీసీ టీవి పూటేజీలో రికార్డయింది. తమ ప్రాంతంలో పులి సంచరిస్తుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురౌతున్నారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.