పొలిటికల్ ఐ: కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ మధ్య అతడు నిర్వహిస్తున్న షో లో ఒక రాజకీయ నాయకుడిని ఇమిటెట్ చేశారు. ఈ సందర్బంగా నాగ బాబుపై ట్రోల్స్ బాగా పెరిగాయి సోషల్ మీడియాలో.
కానీ నాగబాబు ఇవేవీ నన్ను ఏమి చేయలేవు అన్నట్టు హింట్ ఇస్తున్నట్టుగా ఉంది రీసెంట్ గా అతడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్. ఇప్పుడున్నది అంత గాంధీ 2.0 అంటూ ఒక పోస్ట్ చేసాడు ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అయింది.
ఇంతకీ ఈ పోస్ట్‌లో ఏముందని అనుకుంటున్నారా..?. ”ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం పిరికివాడి లక్షణం, వాడు ఒక చెంప మీద కొడితే.. నువ్వు వాడి మొహం పగలకొట్టు..” అని చెబుతూ.. గాంధీ 2.0 (2020) అని నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి నెటిజన్ల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం.