Politicla Eye

లావు ఉన్నవారికి కరోనా సోకితే అంతే..!

తేల్చిన ప్రపంచ బ్యాంకు శాస్త్రవేత్తల బృందం

న్యూయార్క్: కరోనా వైరస్ ఒకవైపు విజృంభిస్తుండగా మరోవైపు దానిపై పలు సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు కూడా వైరస్ ప్రభావంపై శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించింది.

ఈ అధ్యయనంలో పలు విస్తుగొలిపే విషయాలు వెల్లడి అయ్యాయి. అధిక బరువు (లావు) ఉన్నవారు 113 శాతం మంది హాస్పిటల్స్ లో చేరే అవకాశం ఉండగా, వారిలో 74 శాతం మంది ఆక్సీజన్ వెంటిలేటర్లను ఆశ్రయించాల్సి వస్తున్నదని తేల్చింది. మోతాదుకు మించి బరువు ఉన్న వారికి మధుమేహం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీని వల్ల వారి రక్తంలో షుగర్ మోతాదులు పెరిగితే గడ్డ కట్టి, రక్త నాళాలు ఉబ్బ పెలుసుగా మారతాయి. ఈ సమస్యల మూలంగా వారికి చికిత్స కూడా కష్టమవుతుందన్నారు.

ఈ కారణాలతోనే కరోనా వ్యాక్సిన్ కూడా వారికి పెద్ద పని చేయకపోవచ్చని ప్రపంచ బ్యాంకు శాస్త్రవేత్తల బృందం హెచ్చరిస్తోంది. బ్రిటన్ దేశంలో ప్రతి ముగ్గురు అధిక బరువు కలిగిన వారు ఉన్నారు. అదే విధంగా అమెరికాలో 40 శాతం మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like