హైదరాబాద్: ఆచార్య సినిమా కథపై చిత్ర యూనిట్ స్పష్టత నిచ్చింది. ఈ సినిమా కథ, కాన్సెప్ట్ పూర్తిగా దర్శకుడు కొరటాల శివకు మాత్రమే చెందుతుందని ప్రకటించింది.
కథను కాపీ కొట్టారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. ఈ సినిమా కథ కొందరికి మాత్రమే తెలుసని, మోషన్ పోస్టర్ రిలీజు చేసిన తరువాత కాపీ చేశారనడం దారుణమన్నారు. ఇది పూర్తిగా ఒరిజినల్, ఎవరికి వారుగా ఊహించుకోవడం సరికాదన్నారు. మొన్న ఒకరు ఆరోపణలు చేయగా, తాజాగా మరొక రచయిత తనదే కథ అంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఆచార్య చిత్ర యూనిట్ ఆరోపణలు ఖండించింది.