Politicla Eye

బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్-భట్టి విక్రమార్క మధ్య వాడి వేడి చర్చ

ఈ నెల 28 వరకు అసెంబ్లీ అవరమైతే పొడిగింపు

* సీఎం కేసీఆర్…సీఎల్పీ నేత భట్టి మధ్య మీడియా పాయింట్ ఎత్తివేత అంశంపై హాట్ గా చర్చ

* ప్రశ్నోత్తరాల్లో ఆరు ప్రశ్నలు తీసుకోవాలని నిర్ణయించారు.

* 30 నిమిషాలు జీరో అవర్ కి కేటాయించారు.

* మొత్తం 17 రోజుల పని దినాలు..

* అవరమైతే బీఏసీ ఏర్పాటు చేసి సభ దినాలు పొడిగిస్తాం..

* రెవిన్యూ చట్టం సభలో పెట్టిన తర్వాత స్టడీ కోసం 4 రోజుల సమయం ఇవ్వండి..భట్టి

* 4 రోజులు ఎందుకని ప్రశ్నించిన సీఎం కేసీఆర్

* మీరు చట్టం చేయడానికి 3 ఏళ్లు తీసుకిన్నారు మాకు 4 రోజులు ఇవ్వరా అని ప్రశ్నించిన భట్టి

 

పొలిటికల్ ఐ సెప్టెంబర్ 7: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయని బీఏసీ నిర్ణయించింది..అలాగే అవసరం అయితే సమావేశాల్ని పొడగించడానికైనా సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తము 17 పని దినాలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.మొదట రోజు సమావేశం అనంతరం స్పీకర్ అధ్యక్షత న జరిగిన బీఏసీ సమావేశం కొంత హాట్ హాట్ గా కొనసాగింది. బీఏసీ సమావేశం ప్రారంభం నుండే…మాటల వేడి తో మొదలైంది. సభని ఎన్ని రోజులు నిర్వహిద్దామని అనుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగారు. మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిర్వహిస్తామన్నారు సీఎం కేసీఆర్. మేము కూడా ప్రజలకు చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అన్ని విషయాలపై మాట్లాడతాం అని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఇక మీడియా పాయింట్ ఎత్తివేత అంశంపై కొంత మాటలు పెరిగాయి. మీడియా పాయింట్ ఎలా ఎత్తేస్తారు..మా పాత్ర ను కూడా మీరే కట్టడి చేస్తే ఎలా..మీరు ఇక్కడ మైక్ ఇవ్వరు.. కనీసం మీడియా పాయింట్ అయినా ఉంచాలి కదా అని సీఎల్పీ నేత భట్టి అడిగారు. సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా.. అబద్దాలు మాట్లాడొద్దు… సభలో మైక్ ఎందుకు ఇవ్వటం లేదు… సభ్యుల సంఖ్యని బట్టి సమయం ఇస్తారన్నారు సీఎం.
మాది నామినేటెడ్ ప్రభుత్వం కాదు.ఇక్కడ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు మేము కూడా అన్ని విషయాలు ప్రజలకి చెప్పాలి కదా అని ప్రశ్నించారు.మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పండి… మేము చెప్పాలనుకున్నది మేము చెప్తం అని అన్నారు భట్టి.

కొత్త రెవెన్యూ చట్టం పై సీఎం కేసీఆర్ బీఏసీ లో చర్చించారు.కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు.. అందుకే రికార్డులు సీజ్ చేయండి అని ఉదయమే ఆర్డర్ ఇచ్చాం అన్నారు కేసీఆర్. రెవెన్యూ చట్టం సభలో పెట్టిన తర్వాత… స్టడీ చేయడానికి 4 రోజులు గడువు ఇవ్వాలని కోరారు భట్టి విక్రమార్క . అంత సమయం ఎందుకు అని అడిగారు సీఎం.మీరు బిల్లు తయారు చేయడానికి 3 యేండ్లు పట్టింది…మేము స్టడీ చేయడానికి 4 రోజులు సమయం ఇస్తే తప్పేముంది అన్నారు భట్టి విక్రమార్క . రెవెన్యూ చట్టం చాలా కఠినంగా చేస్తున్నామన్నారు కేసీఆర్. సభ పని దినాలు పొడగించాలనే అనుకుంటే మళ్ళీ బీఏసీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like