చెన్నై: తమిళ స్టార్ హీరో సూర్య తాజా చిత్ర సూరరై పొట్రు 200 దేశాలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ హాలీవుడ్ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఈ విషయాన్ని సినీ నిర్మాణ సంస్థ టూడీ ఎంటర్ టైన్ మెంట్ సహ నిర్మాత రాజశేఖర్ పాండ్యన్ ధృవీకరించారు.
ఒక ప్రాంతీయ సినిమాను 200 దేశాలలో అక్టోబర్ 30వ తేదీన తీసుకురావడం ఇదే మొదటిసారి. గత నెలలో విడుదల అయిన కాటుక కనులే మెరిసిపోయే పాటను 15 మిలియన్ల మంది వీక్షించిన విషయం తెలిసిందే.