రంగారెడ్డి: మంత్రాలతో రోగం నయమౌతుందని నమ్మి ఓ వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలోని యాచారం మండలం, సందివనపర్తిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మహేష్ అనే వ్యక్తి గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మహేష్ తన బంధువుల సలహాతో శ్రీహరి అనే మంత్రగాన్ని ఆశ్రయించాడు.
రూ.20 వేలు ఖర్చు అవుతుందని శ్రీహరి చెప్పడంతో.. ఆరోగ్యం బాగుపడిదే చాలు అని భావించిన మహేష్ అడ్వాన్స్ గా రూ.10 వేలు ఇచ్చేశాడు. ఎన్ని మంత్రాలు చేసినా రోగం నయం కాకపోగా.. పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డాడు. దీంతో తన భర్త మృతికి కారణం శ్రీహరే అంటూ.. మృతుని భార్య శివరాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.