ఈ ఏడాది దుబాయ్ లో జరగనున్న ఐపీఎల్ నుంచి వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాథన్ ట్విట్టర్ లో తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ రైనా.. మిగిలిన ఐపిఎల్ సీజన్లలో కూడా అందుబాటులో ఉండరని తెలిపారు. ఈ సమయంలో సురేష్ మరియు అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.