న్యూఢిల్లీ: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల (ఏపీ మూడు రాజధానుల వ్యవహారం) పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించనుంది.