బొంబాయి: గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లోనే ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే మార్కెట్లు లాభాల్లోనే దూసుకెళ్లాయి.
ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ 39467 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో నిఫ్టీకూడా 88 పాయింట్లు లాభపడి 11648 వద్ద స్థిరపడింది.