అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దుపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో ను సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగించింది. రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.
ఇప్పటివరకు రైతులు, సంఘాలు, ప్రజాప్రతినిధులు మొత్తం 70 పిటిషన్లు దాఖలు చేశారు. వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణపై హైకోర్టు ధర్మాసనం న్యాయవాదులతో చర్చించింది. భౌతికదూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని ధర్మాసనం తెలిపింది. అందుకు న్యాయవాదులు కూడా అంగీకారం తెలిపారు.
వాదనల తరువాత స్టేటస్కో అమలు సెప్టెంబరు 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి వరకు ఉన్న స్టేటస్ కో అమలును వచ్చే నెల 21 వరకు పొడిగించి, తదుపరి విచారణను వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు, అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు హైకోర్టు గడువు విధించింది.
Get real time updates directly on you device, subscribe now.
Prev Post
Next Post