పొలిటికల్ ఐ సెప్టెంబర్ 23 2020:
తన నవ్వుతో ,అందంతో బుల్లి తెరపై తన అభినయంతో ఎప్పుడు ఎనర్జిటిక్ గా కనిపించే యాంకర్ శ్రీముఖి… చాలా మంచి యాంకర్ లలో తన పేరు కూడా ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎప్పుడు ఏదొక షోస్ చేస్తూ ఆక్టివ్ గా ఉంటుంది. పటాస్ షోతో యూత్ కి బాగా దగ్గరైన శ్రీముఖి బిగ్ బొస్స్ షో లో కూడా పాల్గొని ఫామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గర చేసుకుంది. షో లో రన్నరప్ గా నిలిచింది. ఈ మధ్య సుమ షో లో పాల్గొన్న శ్రీముఖి మరో రెండేళ్లలో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుండి రిటైర్మెంట్ తీసుకుంటాను అని చెప్పింది. చాలా మంది హీరోయిన్లు మంచి పేరు ఉండగానే ఇండస్ట్రీ నుండి తప్పుకున్నట్టుగా శ్రీముఖి కూడా అదే బాటలో వెళ్తుంది. యాంకర్ గా మాత్రమే కాకుండా జులాయి నేను శైలజ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.కానీ పెళ్లికి ఇంకా రెండేళ్లు ఉన్నాయి కదా ఈ లోపు ప్రేక్షకులను తన యాంకరింగ్ తో ఆకట్టుకుంటుంది.