Politicla Eye

తొలిసారిగా ఆన్ లైన్ లో క్రీడా పురస్కారాలు

న్యూఢిల్లీ: నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. ఈ ఏడాది ఆన్ లైన్ లో క్రీడా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలో కరోనా నేపథ్యంలో తొలిసారిగా ఆన్ లైన్ లో క్రీడా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా ఆయన పుట్టిన రోజైన ఆగష్టు 29 ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like