ఢిల్లీ: టెలికాం స్పెక్ట్రం బకాయిల కేసులో వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు టెలికాం కంపెనీలు బకాయిలు చెల్లించడానికి విముఖంగా ఉంటే తాము స్పెక్ట్రం లైసెన్స్ లు రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయగలమని హెచ్చరించింది.
ఏజీఆర్ ఛార్జీల బకాయిల చెల్లింపు గడువుపై న్యాయస్థానం ఈ కేసులో తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు వొడాఫోన్ ఐడియా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా స్పెక్ట్రం ఆయా కంపెనీలకు ఉండటం వాటి రుణ పరిష్కార ప్రణాళిలను ప్రభావితం చేయనుంది.
మరోపక్క రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్, వీడియోకాన్ లు మరేమైనా బకాయిలు చెల్లించాల్సి వస్తే అవి జియో, ఎయిర్టెల్లపై ప్రభావం చూపనుంది. జియోకు స్పెక్ట్రం పంచుకోవడం, వ్యాపారానికి సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.