చెన్నై: గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్రమంగా కోలుకుంటున్నారని, ఇది శుభ దినం అని ఆయన తనయుడు చరణ్ తెలిపారు. వైద్యులు అందించే చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తున్నదని, ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.
ఇన్నాళ్లుగా తమ కుటుంబ క్షేమం కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి, చికిత్స చేస్తున్న ఎంజీఎం హెల్త్ కేర్ వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే బాలసుబ్రహ్మణ్యం తిరిగి కోలుకుని ఇంటికి వస్తారని ఆశిస్తున్నామని చరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.