విశాఖపట్నం: భీమిలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కాపులుప్పడా గ్రేహౌండ్స్ లో పనిచేస్తున్న ఎస్సై షణ్ముక రావు సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు.
వైద్యం చేయించుకుంటున్నా ఆరోగ్యం కుదుటపడకపోవడం, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మానసికంగా కుంగిపోయారు. మనోవేదనకు గురైన ఆయన తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భీమిలీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు.