Politicla Eye

శిరో ముండనం కేసులో ఏడుగురు అరెస్టు

సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో ఘటన

విశాఖపట్నం: పెందుర్తి మండలం గిరిప్రసాద్ నగర్ కు చెందిన దళిత యువకుడికి గుండు గీసి దాడి చేసిన ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన కర్రీ శ్రీకాంత్ (20)కు నాన్న అమ్మ చెల్లి ఉన్నారు. ఉపాధి కోసం విశాఖ వచ్చిన శ్రీకాంత్ నగరంలోని సుజాత నగర్ లో గల సినీ నిర్మాత బిగ్ బాస్-2 ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో నాలుగు నెలల క్రితం పనికి కుదిరాడు. కాగా ఈ నెల 1 న జీతం తీసుకొని పని మానేశాడు. తమ ఇంట్లో లో దొరికి గురైన సెల్ ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్ నాయుడు భార్య గురువారం రాత్రి శ్రీకాంత్ నీ ఇంటికి రప్పించారు. సెల్ ఫోన్ విషయమై నిలదీయడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్ వెళ్లిపోయాడు.

శుక్రవారం మధ్యాహ్నం మరోసారి సూపర్ వైజర్ ద్వారా శ్రీకాంత్ ఇంటికి పిలిపించారు. నూతన్ నాయుడు భార్య, ఇంట్లో పని చేస్తున్న సిబ్బంది స్టీల్ రాడ్ తో అతన్ని గట్టిగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత శ్రీకాంత్ గుండు కొట్టించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి పంపించేశారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించి ఏడుగురు భాగస్వాముల్ని గుర్తించి అరెస్టు చేశారు. నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి, ఇందిరా రాణి, వరహాలు బాలగంగాధర్, ఝాన్సీ, సౌజన్య రవికుమార్ తదితరులను శనివారం ఉదయం అరెస్టు చేశారు.
దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తప్పక శిక్షిస్తామని పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు. ఈ సమావేశంలో డిసిపి (క్రైమ్) సౌత్ ఇంచార్జి వి. సురేష్ బాబు, ఏసీపీ వెస్ట్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్, పెందుర్తి ఇన్చార్జి సీఐ మల్ల అప్పారావు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like