పొలిటికల్ ఐ సెప్టెంబర్ 9 : సీరియల్ నటి శ్రావణి నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. మధురానగర్ లో తన నివాసం లో ఉరి వేసుకుంది కుటుంబసభ్యులు ఆసుపత్రి కి తరిలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం tiktok ద్వారా పరిచయం ఐన దేవరాజ్ రెడ్డి శ్రావణి ఆత్మహత్యకు కారణం వివరించారు. వివరాల్లోకి వెళ్తే శ్రావణి కి దేవరాజ్ రెడ్డి టిక్ టాక్ లో పరిచయం అయ్యాడు. తనకి తల్లి తండ్రులు ఎవరు లేరని చెప్పటం తో తనని హైదరాబాద్ తీసుకొచ్చి హాస్టల్ లో జాయిన్ చేయించింది. కానీ తనకి హాస్టల్ ఫుడ్ పడటం లేదు అని చెప్పటం తో తన ఇంట్లోనే నివాసం ఇచ్చింది. ఇదే అదునుగా దేవరాజ్ రెడ్డి శ్రావణి ఫోటోలు వీడియోలు తీసి బెదిరింపులకు గురి చేసాడు. దీని గురించి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారు. అయినా కూడా దేవరాజ్ రెడ్డి శ్రావణి ని డబ్బుల కోసం వేధించటం మానలేదు. నిన్న రాత్రి ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్యకి పాల్పడినట్లు తెలుస్తుంది. పొద్దున్నే లేచి గుడికి వెళ్దాం అమ్మ అని చెప్పిన బిడ్డ రాత్రికి రాత్రే విగత జీవి అవ్వటం కుటుంబానికి తీవ్ర దిగ్బంత్రికి గురి చేసింది.
శ్రావణి మనసు మమతా, మౌనరాగం సీరియల్లో నటిస్తుంది. దేవరాజరెడ్డి కి కూడా సీరియల్ లో నటించే అవకాశం కలిపించింది ఇతను భాగ్యరేఖ సీరియల్ లో నటిస్తున్నాడు.
537
Share
Get real time updates directly on you device, subscribe now.