ఢిల్లీ: సెప్టెంబర్ 1వ తేదీన ప్రకటించనున్న అన్ లాక్ 4.0 లో పాఠశాలలు తెరిచేందుకు అనుమతించవచ్చని తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పట్లో స్కూళ్లు తెరిచేందుకు అనుమతించడం లేదని కేంద్రం ప్రకటించింది.
కేంద్ర హోం శాఖ ప్రకటించబోయే అన్ లాక్ 4.0 సడలింపుల్లో స్కూళ్లు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పష్టత నిచ్చారు. కరోనా కేసులు విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెరిచే అలోచన లేదని ఆయన తెలిపారు. సినిమా థియేటర్లు, బార్ల విషయంలో కూడా ముందుగా అనుమతివ్వాలని అనుకున్నారు. కాని మరో నెల రోజుల తరువాత అనగా అక్టోబర్ 1వ తేదీ తరువాత ఇవ్వనున్నట్లు సమాచారం.
కంటైన్మెంట్ జోన్లలో గతంలో మాదిరే ఆంక్షలు కొనసాగనున్నాయి. మెట్రో రైళ్లపై వివిధ రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.