న్యూఢిల్లీ: నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు సుప్రీంకోర్టులో విపక్షాలు రివ్యూపిటిషన్ దాఖలు చేయనున్నాయి.
ఈ సందర్భంగా నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహణపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ పిటిషన్ వేయనున్నాయి. మరో పక్క సుప్రీం తీర్పుమేరకు పరీక్షల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను మొదలు పెట్టింది.