హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసిల్దార్ లంచం కేసులో మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి పాత్రపై విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ ప్రకటించింది.
ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, అంజిరెడ్డి ఆ భూమి డాక్యుమెంట్లు రేవంత్ రెడ్డికి చెందినవిగా ఒప్పుకున్నారని అన్నారు. అంజిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు డాక్యుమెంట్లపై లోతుగా విచారించగా, రేవంత్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మరోసారి విచారిస్తామని ఆయన వివరించారు. ఆయన పాత్ర ఉందని తేలితే పిలిపించి విచారిస్తామని సూర్యనారాయణ వెల్లడించారు.
లాకర్లపై తహసిల్దార్ బాలరాజు నాగరాజు, ఆయన భార్య తమను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎన్ని లాకర్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయనేది సరిగా చెప్పడం లేదన్నారు. లంచం ఇవ్వడం కోసం వరంగల్ నుంచి డబ్బులు తీసుకువచ్చినట్లు రియల్టర్ శ్రీనాథ్ అంగీకరించాడని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.