హైదరాబాద్: గన్ తో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కాల్పులకు పాల్పడిన ఘటన నగరంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రాకారం.. నాగమల్లేష్ అనే ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి వినాయక నిమజ్జనం సందర్భంగా గన్ తో పబ్లిక్ ప్లేస్ లో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు నాగమల్లేష్ ను అదుపులోకి తీసుకున్నారు.