అందం అభినయం కలిసిన నటి శ్రియ. ప్రతిభ కలిగిన నటులలో ఒకరుగా కచ్చితంగా శ్రియ పెరు ఉంటుంది. అందుకే 2దశాబ్దాలుగా ఇంకా రాణిస్తూ ఉన్నారు.ప్రస్తుతం శ్రియ శరన్ సుజనారావు డైరెక్ట్ చేస్తున్న రియల్ లైఫ్ డ్రామా మూవీ “గమనం” ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇవ్వాళ శ్రియ పుట్టినరోజు సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ఫస్ట్ లుక్ రిలీస్ చేశారు. పోస్టర్లో సామాన్య స్త్రీ గా కనిపిస్తూ దేనికోసమో మధన పడుతున్నట్టుగా ఉంది. ఈ సినిమాని తెలుగు హిందీ మలయాళం తమిళ కన్నడ భాషల్లో పాన్ ఇండియాగా రూపొందుతుంది.
దీనికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.