అమరావతి: ఏపీలో ప్రైవేట్ ల్యాబ్ లలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరల తగ్గించారు. గతంలో రూ.2900 ఉన్న స్వాబ్ టెస్ట్ ధరను ఒక వేయ్యి తగ్గించి రూ.1900 కు ఖరారు చేశారు. ప్రభుత్వం పంపించే శాంపిల్స్ టెస్టింగ్ ధర రూ.2400 నుంచి రూ.1600 కు తగ్గించేశారు.
కరోనా నిర్ధారణ కిట్ ల తయారీ పెరిగి, డిమాండ్ పడిపోవడంతో ప్రభుత్వం ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నది. ఎక్కువమంది అనుమానితులకు పరీక్షలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రేట్లు తగ్గించినట్లు ప్ిభుత్వం పేర్కొన్నది. అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖాధికారులు ప్రైవేట్ ల్యాబ్ ల ధరలపై పర్యవేక్షణ ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జార చేసింది.