న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో.. విధించిన లాక్ డౌన్ల కారణంగా దేశంలో 8 శాతం వాయు కాలుష్యం తగ్గిందని పర్యావరణ శాఖ తెలిపింది.
దేశంలో గత కొన్ని నెలలుగా.. రోడ్లపైకి వచ్చే వాహనాల వినియోగం తగ్గడం, ఇదే సమయంలో కర్భన ఉద్ఘారాలను విడుదల చేసే అనేక ఫ్యాక్టరీలు మూతపడడం వంటి కారణాలతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గినట్టు తెలిపింది.