జబర్దస్త్ షో లో యాంకరింగ్ చేస్తూ ఎంతగానో పాపులర్ అయినా ఈ బొమ్మ వెండి తెరపై కనిపించటానికి ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తుంది. గుంటూరు టాకీస్ లో చేసినప్పటికీ దాని తరవాత పెద్దగా అవకాశాలు ఏమి రాలేదు. ఇప్పుడు తాజాగా నందు హీరోగా చేస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ దీనిలో హీరోయినిగా రష్మీ నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ట్విట్టర్లో రష్మీ తన పోస్టర్ ని రిలీస్ చేసింది “పోతుగాడి లవర్ వాణి” అని ట్వీట్ చేస్తూ ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. కొత్త లుక్ లో రష్మీ అదరకొట్టేసింది. కృష్ణుడి గెట్ అప్ లో సంప్రదాయంగా కనిపించింది.