హైదరాబాద్: తొమ్మిదేళ్లుగా ఒక యువతిపై జరిగిన అత్యాచారం కేసులో డాలర్ బాబు అలియాస్ కేఎస్ఆర్ కోసం పోలీసులు వేటాడుతున్నారు. తనపై వేలసార్లు అత్యాచారం చేశారని, వారి పేర్లను పంజగుట్ట పోలీసులకు యువతి అందచేసిన విషయం తెలిసిందే.
దీనిపై సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. డాలర్ బాబు యువతిని రక్షిస్తున్నట్లుగా నటించి లైంగికంగా వాడుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో తనకేం సంబంధం లేదని యాంకర్ ప్రదీప్ బావురుమంటున్నాడు.