ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సిందేనని పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా జరపాలని, కొన్నేళ్ల నుంచి కమిటీలకు ఎన్నికలు జరగడం లేదన్నారు.
ఈ రెండు చేయకుండా వదిలేస్తే మరో యాభై ఏళ్లు అయినా పార్టీ అధికారం చేజిక్కించుకోవడం కల్ల అని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. పార్టీ నాయకత్వంలో మార్పు తక్షణావసరం అని, సంస్థాగతంగా పనిచేసే శాశ్వత నాయకత్వం అవసరమన్నారు. ఏఐసీసీ మొదలు డీసీసీ వరకు నిత్యం కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం ఉండాలన్నారు. అప్పుడే పార్టీ బలం పెరుగుతుందని గులాం నబీ ఆజాద్ అన్నారు.